శ్రీ శ్రీ శ్రీ
విరూపాక్షేశ్వర ఆలయం
దొడ్డేశ్వరస్వామి ఆలయము ముందుభాగం కుడివైపున ఉన్న అద్భుత శిలాఖండం ఈ విరూపాక్షేశ్వర ఆలయం. ఇందు స్థంభాల ఆకృతి, గోడల నిర్మాణం చూపరులను ఆకట్టుకుంటుంది.
శివలింగానికి ఎదురుగా ముఖద్వారంలో మండపంలోని నందిని చేతితో తాకితే ఢన్, ధన్ మనే శబ్దం వస్తుంది. తరంగాల మాదిరి శబ్దం రావడం ఆ నాటి గొప్ప రాజులు, నేర్పరిగల శిల్పుల సమ్మేళనం ఈ నాళంబరాజ్యం.
నొళంబరాజుల కాలంలో నిర్మించిన దేవాలయాలు హేమావతి, ఆవని(కర్నాటక), నంది (కర్నాటక), ధర్మపురి (తమిళనాడు) నందు ప్రముఖ ఆలయాలు నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఆవనియందు గల లక్ష్మణ్ణేశ్వర ఆలయం హేమావతిలోని దొడ్డేశ్వర ఆలయంతో పోల్చవచ్చును. ఇందు ఆలయ గది గోడలకు కిటికీలు మరియు గవాక్షములు గల్లి అందు అష్టదిక్పాలకుల నిగ్రహాలు పొందుపరచారు. లక్ష్మణ్జేశ్వర ఆలయ ఆవరణంలో భరతేశ్వర, ఆంజనేశ్వర, శత్భుఘ్నేశ్వర దేవాలయాలు గలవు.
నంది (కర్నాటక) యందు భోగనందీశ్వరుడు ఉన్నందున నంది అనే పేరు ఆ (ప్రాంతమునకు స్థిరపడెను. అరుణాచలేశ్వర దేవాలయం కూడా నందిలో గలదు.
ధర్మపురియందు కామాక్షమ్మ, మల్లికార్జున దేవాలయాలు గలవు. వీరి కాలంలో కర్నాటకలోని తడకలూరు శిరా తాలూక నందు బసవణ్ఞ దేవాలయం వెలిసినది. మరియు హేమావతి సిద్దేశ్వరునికి తమ్మునిగా భావించే వద్దీకెరె (హిరియూరు – కర్నాటక) సిద్ధప్ప దేవాలయంలో ప్రశస్తికల్లిన భైరవేశ్వర స్వామిని హేమావతి నుండి తరలించుకొనిపోయి ప్రతిష్టించి ఉండవచ్చునని భావిస్తున్నారు.
హేమావతిలోని పురాతన చెరువుకు ‘హెంజేరు చెరువని పిలుస్తారు. ‘హేమావతికి గల పురాతన పేర్లు పెంజేరు, హెంజేరు. మరియు పెంజేరు అర్ధం “పెను + సేరు = పెంజేరు” అని, పెద్దగాచేరుట అని, శైవక్షేత్రాలు ఎక్కువగా కలిసి ఉన్న ప్రదేశం అని తెలుస్తుంది.
‘హెంజేరు సిద్దేశ్వర అనే పేరు రావడానికి ప్రాచీనం నుండి ఒక కథ వాడుకలో ఉంది. కాపాలి మతస్థలైన హెంజేరు సిద్ధప్ప, మల్లప్పలు భక్తాగ్రేసరులుగా, గురువులుగా ప్రసిద్ధులు. సిద్దేశ్వర భక్తి పారవశ్యాలను, ప్రాశస్తాన్ని ప్రచారం చేశారు.
వారి నామాలనే దేవాలయాలకు సిద్దేశ్వర స్వామి ఆలయంగా, మల్లేశ్వరస్వామి ఆలయంగా నేడు వాడుతుండటం మనం చూడవచ్చును.
ప్రాంతీయ పాలనలో ఒక అత్యున్నత దేవత, రాజు మరియు మొత్తం రాజ్యాన్ని ధృవీకరించే ఒక దైవిక అధిపతి ఉండటం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. భైరవ, శివుని యొక్క భయానక రూపం, కాలమే (కాలా), తన ఆధిపత్యాన్ని (వీరభద్ర లాగా) పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఒక రాజుకు సమర్థుడైన రక్షకుడిగా మరియు అధిపతిగా పనిచేశాడు. హెంజెరప్పను ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నోళంబ రాజులు తమ ప్రధాన దైవంగా ఎంచుకున్నారని అనుమానిస్తున్నారు. రాజు మరియు మొత్తం రాజ్యానికి విస్తరించిన ఈ దేవత యొక్క సరైన ఆచార నిర్వహణను నిర్ధారించే బాధ్యత పాశుపతలు మరియు/లేదా కాలాముఖులకు అప్పగించబడింది.
కర్ణాటకకు సంబంధించి, కొంతమంది పండితులు పాశుపతాలు మరియు కాలాముఖాలను పరస్పరం మార్చుకోదగినవిగా భావిస్తారు. కాలాముఖ శాసనాలలో, వారు అప్పుడప్పుడు తమను తాము లకులాగాముల అనుచరులుగా గుర్తించుకుంటారు. “కాలాముఖ శాఖకు సంబంధించి మైసూరు శాసనాలలో లకులా లేదా పాశుపత వ్యవస్థ తరచుగా ప్రస్తావించబడింది మరియు కన్నడ ప్రాంతంలో పాశుపతలను కాలాముఖులుగా పిలిచేవారని స్పష్టంగా తెలుస్తుంది” అని హాండికీ ముగించారు.
మరొక పండితుడు లకులీసా అవతారమైన చిల్లుక నిజానికి కాలాముఖ బోధకుడని సూచిస్తున్నాడు. కర్నాటకలోని తొలి కాలాముఖ శాసనాలు (806 మరియు 810 A.D.) నంది, నోలంబ కేంద్రం నుండి ఉద్భవించాయి. ఏదేమైనా, 958లో తాండికొండ మంజూరు కాకుండా, పదకొండవ శతాబ్దం వరకు కొన్ని శాసనాలు స్పష్టంగా కాలాముఖ అనుబంధాన్ని సూచిస్తాయి, కొన్ని నొలంబ గ్రాంట్లు ప్రత్యేకంగా కాలాముఖాలను పేర్కొన్నాయి. కాలాముఖాలకు సంబంధించి గణనీయమైన అస్పష్టత ఉంది; వారి అభ్యాసాల గురించి చాలా తక్కువగా తెలుసు మరియు మనుగడలో ఉన్న ఏ గ్రంథాలు ఈ సమస్యను స్పష్టం చేయలేదు. శివుని యొక్క ఉగ్ర రూపాలు కాపాలికలకు నిస్సందేహంగా ముఖ్యమైనవి, కాలాముఖులతో పాటు ఉన్న మరొక శైవ శాఖ, కొన్నిసార్లు ఇద్దరి మధ్య గందరగోళాన్ని కలిగిస్తుంది. భైరవ కపాలికలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది; ఏది ఏమైనప్పటికీ, కాలాముఖ సిద్ధాంతాలలో భైరవుడు ఇదే విధమైన స్థానాన్ని కలిగి ఉన్నాడా అనేది అనిశ్చితంగా ఉంది.
సిద్దేశ్వర స్వామి ఆలయం
చైత్రం, వైశాఖం మాసాలలో సంధ్యా సమయాలలో సూర్యకాంతి 5.8 అడుగుల ఎత్తు గల సిద్దేశ్వర స్వామిని తాకి చూడడానికి ఏంతో ఆహ్లాదంగా ఉంటుంది.
దొడ్డేశ్వర స్వామి ఆలయం
శ్రీ దొడ్డేశ్వర స్వామి ఆలయములో శైవ పురాణ కథలతో పాటు విష్ణవ పురాణ గాథలు కూడా చెక్కబడి ఉన్నాయి. అతిపెద్ద నంది దేవాలయానికి ఎదురుగా ఉంది.
చేళ భైరవ స్వామి ఆలయం
శ్రీ చేళభైరవస్వామి ఆలయములో బెల్లం నైవేద్యం చేస్తే వారి ఇంటి పరిసరాలకు పాము, తేళ్లు ఇంకా ఎటువంటి విషపురుగులు రాకుండా స్వామి కాపాడుతాడని విస్వాసం.
మల్లేశ్వరస్వామి ఆలయం
మల్లేశ్వరస్వామి ఆలయములో ఉదయం సూర్యకిరణాలతో లింగం ఎంతో ప్రకాశవంతంగా అగుపడును. ఇది దొడ్డేశ్వరాలయానికి ఎడమవైపున కలదు.
విరూపాక్షేశ్వర ఆలయం
ఆలయము శిల్పకళకు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయము దొడ్డేశ్వరస్వామి ఆలయానికి కుడివైపున కలదు. శివలింగానికి ఎదురుగా మండపంలో నంది చేతితో తాకితే శబ్దం వస్తుంది.
నవకోటమ్మ ఆలయం
సిద్దేశ్వరస్వామికి చెల్లెమ్మగా నవకోటమ్మను ఇక్కడి జనులు పూజిస్తారు. సంతాన ప్రాప్తికై నవకోటమ్మను పూజలు నిర్వహిస్తారు ఇక్కడి జనులు.