వీరభద్ర సిద్దేశ్వర, హేంజేరు సిద్ధప్ప, మూర్కణప్ప , హేంజేరు భైరవ, యజ్ఞారీశ్వర ఇలా పలు నామాలతో కొలవబడు హేమావతి శివాలయము క్రీ.శ. 8-11వ శతాబ్దంలో నొళంబు రాజులు నిర్మించినది.
హేమావతి నందు వెలసిన మానవరూపదారి అయిన పరమశివుని అతిపెద్ద శిలావిగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన శివాలయం.
ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదిన సంబరాలలో భాగంగా జాతర, సిరిమాను, పూలరథం, అగ్నిగుండం, చిన్న రథోత్సవం మరియు బ్రహ్మరథోత్సవం వంటి పెద్ద వేడుకలు జరుగును.