హేమావతికి సమీపంలోని విమానాశ్రయం బెంగళూరులో ఉంది, ఇది హేమవతి నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చల్లకెరె హేమావతికి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న హేమావతికి సమీప రైల్వే స్టేషన్.
హిందూపూర్ మరియు పెనుకొండ రెండు బాగా అనుసంధానించబడిన పట్టణాలు, ఇక్కడ నుండి హేమావతికి బస్సులు అందుబాటులో ఉన్నాయి మరియు హేమవతి అనంతపురం నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
హేమవతిలోని
ప్రముఖ శివాలయాలు
సిద్దేశ్వర స్వామి ఆలయం
చైత్రం, వైశాఖం మాసాలలో సంధ్యా సమయాలలో సూర్యకాంతి 5.8 అడుగుల ఎత్తు గల సిద్దేశ్వర స్వామిని తాకి చూడడానికి ఏంతో ఆహ్లాదంగా ఉంటుంది.
దొడ్డేశ్వర స్వామి ఆలయం
శ్రీ దొడ్డేశ్వర స్వామి ఆలయములో శైవ పురాణ కథలతో పాటు విష్ణవ పురాణ గాథలు కూడా చెక్కబడి ఉన్నాయి. అతిపెద్ద నంది దేవాలయానికి ఎదురుగా ఉంది.
చేళ భైరవ స్వామి ఆలయం
శ్రీ చేళభైరవస్వామి ఆలయములో బెల్లం నైవేద్యం చేస్తే వారి ఇంటి పరిసరాలకు పాము, తేళ్లు ఇంకా ఎటువంటి విషపురుగులు రాకుండా స్వామి కాపాడుతాడని విస్వాసం.
మల్లేశ్వరస్వామి ఆలయం
మల్లేశ్వరస్వామి ఆలయములో ఉదయం సూర్యకిరణాలతో లింగం ఎంతో ప్రకాశవంతంగా అగుపడును. ఇది దొడ్డేశ్వరాలయానికి ఎడమవైపున కలదు.
విరూపాక్షేశ్వర ఆలయం
ఆలయము శిల్పకళకు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయము దొడ్డేశ్వరస్వామి ఆలయానికి కుడివైపున కలదు. శివలింగానికి ఎదురుగా మండపంలో నంది చేతితో తాకితే శబ్దం వస్తుంది.
నవకోటమ్మ ఆలయం
సిద్దేశ్వరస్వామికి చెల్లెమ్మగా నవకోటమ్మను ఇక్కడి జనులు పూజిస్తారు. సంతాన ప్రాప్తికై నవకోటమ్మను పూజలు నిర్వహిస్తారు ఇక్కడి జనులు.