శ్రీ శ్రీ శ్రీ
దొడ్డేశ్వర స్వామి ఆలయం
నొళంబరాజుల నిర్మించిన ఆలయాలలో గొప్ప ఆలయం దొడ్డేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయం నందు సమన్వయదృష్టితో గమనిస్తే శైవ కథలేకాక, వైష్ణవకథా సన్నివేశాలు కూడా ఉన్నాయి. నొళంబ రాజుల అన్ని ఆలయాలకు దొడ్డేశ్వరస్వామి ఆలయం ఒక ప్రాతిపదిక. ఈ దేవాలయానికి ఎదురుగా అతి పెద్ద నంది మండపంలో ఉంది. కుడివైవున కోనేటి బావి గలదు. ఆలయంలో స్థంభాలకు, గోడలకు, దారమునకు ప్రతిచోటనూ భారతంలో కన్పించే అన్ని కథలను ఈ ఆలయంలో చూడవచ్చును. శిల్పుల నేర్పరితనం అమోఘం. ఇందులోని స్థంబాలలో ఒకవరుస మహాభారత వీరగాథలు మరొక వరుస స్థంభాలకు రామాయణ వీరగాథలు కనిపిస్తాయి. ఆనాటి రాజులకు శైవులు, వైష్ణవులు అనే బేధంలేదని తెలుస్తుంది. ముఖద్వారాలకు స్థంభాలకు నల్లటిరాతిని వాడటం జరిగింది. ఎక్కడా మట్టిని వాడినట్లులేదు.
నొళంబరాజుల ఆలయాల విశేషం ఏమనగా దొడ్డేశ్వరస్వామి ఆలయం, సిద్దేశ్వరస్వామి ఆలయం పడమర ముఖద్వారమై ఉండటం విశేషం. ఈశ్వర – దేవాలయాలన్ని తూర్చువాకిలి ఉన్నాయి. కాని హేమావతియందు ఈ రెండు వడమరకు ముఖద్వారంగా ఉండి ముఖద్వారంలో శిఖరం లేకపోవడం ముందుభాగంలో నంది ఉండటం విశేషం.
ఆలయ గర్భగుడికి సూర్యకిరణాలు సాయం సంధ్యావేళ శివలింగాలను తాకడం మహా విశిష్ట దృశ్యాలలో ఇదొకటి. ప్రపంచంలోని ప్రాచీన ఆలయాలలో ఏ ఆలయానికి కిటీకీలు, గవాక్షములు లేవు. కాని హేమావతి నందు నొళంబరాజుల ఆలయాలలో గాలి వెలుతురు రావడానికి ఆలయ గోడలకు కిటీకీలు చేపట్టి ఆ కిటికీలకు మధ్యభాగంలో గంగ, విష్ణు, బ్రహ్మ, కార్తికేయ, మిథున మున్నగు దేవతాశిల్పాలను పొందుపరచి జగమంతా భక్తిపారవశ్యం అని చాటిచెప్పడమేకాక వాన్తుశాస్త్రంననునరించి కిటికీలు, గవాక్షములకు నాంది పలికి వాస్తుశాస్త్ర రంగానికి శకారంభం చేశారు.
దొడ్డేశ్వరస్వామి ఆలయ ముఖాద్వారములోనే శృంగార సన్నివేశాలను అద్భుతంగా శిల్పులు చేపట్టిన దృశ్యం రక్తి కల్గిస్తుంది. మరియు ముఖద్వారం ఎడమవైపునగల ఓ నాట్యకారిణి కుడివైపు చూడమని సంకేతం ఇవ్వగా, కుడివైపు నాట్యకారిణి ఎడమవైపు చెవిలో చూడమని సంకేతం ఇస్తుంది. దీన్ని నిశితంగా పరిశీలించిన దుండగులు ఎదురుగా మండపంలోని నందుల చెవులను పగులగొట్టి అందు పొందిగిన వజ్రాలను దొంగిలించారని ప్రజలు చెప్పుకుందురు.
దొడ్డేశ్వర స్వామి ఆలయ ముందు భాగంలోగల కోనేటిబావిలో ఒకే రోజులోనే కోనేటినీరు ఏడురంగులుగామారే అద్భుతం ఉండేది. ఈ పవిత్రజలాన్ని తాగిన భక్తులు సంపూర్ణ ఆరోగ్యవంతులు. భారత పురావస్తుశాఖవారు 1984 సంవత్సరములో కోనేటిబావి గచ్చునకు సిమెంట్ ప్లాస్టింగ్ చేయడంతో రంగులు
మారడం లేక నీటి జాడకూడా తగ్గెను.
హేమావతి వద్ద ఉన్న నొలుంబుల దొడ్డేశ్వర ఆలయ సముదాయం వివిధ దేవాలయాలు మరియు గర్భాలయాలను కలిగి ఉంది, వీటిలో చాలా దురదృష్టవశాత్తు శిథిలావస్థకు చేరుకున్నాయి. సమీపంలో, ఒక మ్యూజియం దాని ప్రాంగణం లోపల మరియు వెలుపల అనేక విరిగిన శిల్పాలను కలిగి ఉంది. అదనంగా, ఈ దెబ్బతిన్న శిల్పాలు ఆలయ సముదాయం, చుట్టుపక్కల పొలాలు మరియు సమీపంలోని మారుమూల ప్రాంతాలలో చెల్లాచెదురుగా ఉన్నాయి. చాళుక్యుల బొమ్మలలో సూర్యుని వర్ణన, గుర్తించినట్లుగా, తరచుగా విల్లులు మరియు బాణాలతో ఆయుధాలు ధరించి, దహనం ద్వారా చీకటిని తరిమివేసేందుకు యుద్ధప్రాతిపదికన బొమ్మలతో కూడి ఉంటుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, రాజేంద్ర చోళుడు ఈ స్థలాన్ని సందర్శించడం వల్ల దొడ్డేశ్వర ఆలయ నిర్మాణం మరియు 50 స్తంభాలను తొలగించడం జరిగింది, ఆలయ సముదాయం శిథిలావస్థకు చేరుకుంది మరియు వదిలివేయబడిన స్థితిలో ఉంది.తంజావూరు నుండి ఏడు మైళ్ల దూరంలో ఉన్న తిరువయ్యార్ పురాతన చోళ దేవాలయంగా వర్ణిస్తూ, అప్పర్స్వామి మందిరంతో పాటుగా ఉన్న ప్రదేశం గురించిన వివరాలు అందించబడ్డాయి.
సిద్దేశ్వర స్వామి ఆలయం
చైత్రం, వైశాఖం మాసాలలో సంధ్యా సమయాలలో సూర్యకాంతి 5.8 అడుగుల ఎత్తు గల సిద్దేశ్వర స్వామిని తాకి చూడడానికి ఏంతో ఆహ్లాదంగా ఉంటుంది.
దొడ్డేశ్వర స్వామి ఆలయం
శ్రీ దొడ్డేశ్వర స్వామి ఆలయములో శైవ పురాణ కథలతో పాటు విష్ణవ పురాణ గాథలు కూడా చెక్కబడి ఉన్నాయి. అతిపెద్ద నంది దేవాలయానికి ఎదురుగా ఉంది.
చేళ భైరవ స్వామి ఆలయం
శ్రీ చేళభైరవస్వామి ఆలయములో బెల్లం నైవేద్యం చేస్తే వారి ఇంటి పరిసరాలకు పాము, తేళ్లు ఇంకా ఎటువంటి విషపురుగులు రాకుండా స్వామి కాపాడుతాడని విస్వాసం.
మల్లేశ్వరస్వామి ఆలయం
మల్లేశ్వరస్వామి ఆలయములో ఉదయం సూర్యకిరణాలతో లింగం ఎంతో ప్రకాశవంతంగా అగుపడును. ఇది దొడ్డేశ్వరాలయానికి ఎడమవైపున కలదు.
విరూపాక్షేశ్వర ఆలయం
ఆలయము శిల్పకళకు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయము దొడ్డేశ్వరస్వామి ఆలయానికి కుడివైపున కలదు. శివలింగానికి ఎదురుగా మండపంలో నంది చేతితో తాకితే శబ్దం వస్తుంది.
నవకోటమ్మ ఆలయం
సిద్దేశ్వరస్వామికి చెల్లెమ్మగా నవకోటమ్మను ఇక్కడి జనులు పూజిస్తారు. సంతాన ప్రాప్తికై నవకోటమ్మను పూజలు నిర్వహిస్తారు ఇక్కడి జనులు.