About Hemavathi Temple

Contact Info

హేంజేరు సిద్దేశ్వరస్వామి దేవాలయం, హేమావతి, అమరాపురం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

+091 9110315278

info@hemavathitemple.com

శ్రీ శ్రీ శ్రీ

హెంజేరు సిద్ధేశ్వర దేవాలయం

వీరభద్ర సిద్దేశ్వర, హేంజేరు సిద్ధప్ప, మూర్కణప్ప , హేంజేరు భైరవ, యజ్ఞారీశ్వర ఇలా పలు నామాలతో కొలవబడు హేమావతి శివాలయము క్రీ.శ. 8-11వ శతాబ్దంలో నొళంబు రాజులు నిర్మించినది.

హేమావతి నందు వెలసిన మానవరూపదారి అయిన పరమశివుని అతిపెద్ద శిలావిగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన శివాలయం.

ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదిన సంబరాలలో భాగంగా జాతర, సిరిమాను, పూలరథం, అగ్నిగుండం, చిన్న రథోత్సవం మరియు బ్రహ్మరథోత్సవం వంటి పెద్ద వేడుకలు జరుగును.

శ్రీ దొడ్డేశ్వరాలయం
శ్రీ మల్లేశ్వరాలయం
శ్రీ విరుపాక్షేశ్వరాలయం
శ్రీ చేళ భైరవస్వామి ఆలయం

హేమావతి దేవాలయం

శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో ఉన్న శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయము చాలా ప్రసిద్ధి చెందినది. దేవాలయ నిర్మాణము, ఇక్కడి శిల్ప సంపద, స్థల మహిమ మరియు ఇక్కడి ప్రజల సంస్కృతి సంప్రదాయాల నుంచి మనం ఎంతో తెలుసుకోవచ్చు.

ఆర్కియాలజికల్

సంగ్రహాలయం, హేమావతి

హేమావతిలో శిథిలమైన ఆలయాల నుండి ప్రాచీన రామాయణం, భాగవతం, భారత పురాణ గాథలు, దేవతా విగ్రహాలు మరియు శిలాశాసనాలు ఇక్కడి మ్యూసియంలో భద్రపరచడం జరిగింది.

విగ్రహ సంపదలో వినాయకుడు, భైరవుడు, దక్షిణామూర్తి విగ్రహం, సూర్య దేవుడు, పరశురాముడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, సప్తమాతికేలా విగ్రహం, వీణాధారశివుడు ఇంకా ఎన్నెన్నో పూడికతీతల్లో అనేకం లభిస్తున్నాయి.

మహేశ్వరుడు ఉమాదేవిల ఆదర్భ దంపతుల విగ్రహాలు మరియు ఇంద్రాణి, వరాహమూర్తి విగ్రహాలు, నెమలి వాహన కుమారస్వామి విగ్రహాలను మనం చూడవచ్చును. ప్రధాన ఆలయంలోని శివుని సహజరూప విగ్రహంలాంటి చిన్నదైన భైరవరూప విగ్రహం కూడా మ్యూజియంలో భద్రపరచారు.

హేమావతిలోని మ్యూజియంలో ఎన్నెనో ప్రత్యేకమైన విగ్రహాలు చాలా ఆకర్షణీయం.

హేమవతిలోని

ప్రముఖ శివాలయాలు

మరిన్ని వివరాలు

సిద్దేశ్వర స్వామి ఆలయం

శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా మినహాయించి అన్ని దేవాలయాలకు మంటపంలో నంది ఉంటుంది.

01
మరిన్ని వివరాలు

దొడ్డేశ్వర స్వామి ఆలయం

హేమావతి ఆలయాల్లో నొళంబరాజుల నిర్మించిన గొప్ప ఆలయం. ఈ దేవాలయానికి ఎదురుగా అతి పెద్ద నంది మండపంలో ఉంది.

02
మరిన్ని వివరాలు

చేళ భైరవ స్వామి ఆలయం

నొళంబరాజుల కాలంలో ప్రజల భక్తిని, నమ్మకాలను పరిశీలించాలంటే చేళభైరవస్వామి ఆలయం గూర్చి తెలుసుకోవాలి.

03

మీ ప్రయాణ కథనాన్ని మాతో పంచుకోండి

హేమావతి చూడదగిన అద్భుతమైన ప్రదేశం. దయచేసి మీ పర్యటనను మాతో పంచుకోండి. మీ పర్యటన ఎంత అద్భుతంగా ఉందో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు మా సందర్శకులకు తెలియజేయండి.

మేము మీ ప్రయాణాన్ని ఇక్కడ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తాము.

ఉత్తమ స్టోరీ టెల్లింగ్ మరియు అద్భుతమైన ఫోటో ఫీచర్లు అద్భుతమైన బహుమతులు మరియు టీ-షర్టులు, కాఫీ మగ్‌లు, కీ చైన్‌లు, నోట్ బుక్‌లు మొదలైన మీ ఫోటో ప్రింటెడ్ వస్తువులను కూడా గెలుచుకోవచ్చు.

    Install our Mana Netha App for latest news on
    politics, polls and job opportunities.